Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్మూడో మ్యాచ్ లో సింధు ఓటమి

మూడో మ్యాచ్ లో సింధు ఓటమి

PV Sindhu:
బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్-2021, మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పివి సింధు మూడో మ్యాచ్ లో ఓటమి పాలైంది. థాయిలాండ్ క్రీడాకారిణి చోచువోంగ్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో 12-21; 21-19, 14-21 తేడాతో కోల్పోయింది. మొత్తం మూడు మ్యాచ్ లలో రెండిటిలో గెలిచిన సింధు తర్వాతి రౌండ్లోకి ప్రవేశించింది. చోచువోంగ్ తాను ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ‘ఏ’ లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సింధు రెండో స్థానం సంపాదించింది.

మహిళల సింగిల్స్ లో వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న చోచువొంగ్ మొదటి సెట్ ను సునాయాసంగా గెల్చింది, హోరాహోరీగా సాగిన రెండో సెట్ లో పుంజుకున్న సింధు సత్తా చాటి 21-19 తో గెల్చుకుంది. మూడో సెట్ లో సింధుపై చోచువొంగ్ పైచేయి సాధించి విజయం సాధించింది.

వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న సింధు తర్వాతి రౌండ్లో (సెమీఫైనల్లో) నంబర్ టూలో కొనసాగుతున్న జపాన్ క్రీడాకారిణి యమగుచి తో తలపడే అవకాశం ఉంది.

ఇక పురుషుల విభాగానికి వస్తే, వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ లో నంబర్ టూ లో ఉన్న లీ జి జియాతో లక్ష్య సేన్ తలపడే అవకాశం ఉంది.

Also Read : శ్రీకాంత్ ఔట్,  మహిళల జోడీ విజయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular