మలేషియా ఓపెన్ లో భారత ఆటగాళ్ళు పివి సింధు, హెచ్ ఎస్ ప్రన్నోయ్ లు క్వార్టర్స్ ఫైనల్స్ లో ఓటమి పాలయ్యారు. దీనితో ఇండియా కథ ముగిసినట్లయింది.
మహిళల సింగల్స్ లో పివి సింధుపై 13-21; 21-15; 21-13తో తైవాన్ క్రీడాకారిణి తై జు యింగ్ గెలుపొందింది.
పురుషుల సింగిల్స్ లో ఇండోనేషియా ఆటగాడు జోనాటన్ క్రిస్టీ చేతిలో 21-18; 21-16 తో ప్రణయ్ ఓటమి పాలయ్యాడు
ఈ నెల 5న మొదలయ్యే మలేషియా మాస్టర్స్ టోర్నీలో భారత ఆటగాళ్ళు సత్తా చాటాలని ఆశిద్దాం.