Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్ఇండోనేషియా మాస్టర్స్:  క్వార్టర్స్ కు సింధు

ఇండోనేషియా మాస్టర్స్:  క్వార్టర్స్ కు సింధు

Sindhu into Quarters: భారత బ్యాడ్మింటన్ స్టార్  పివి సింధు ఇండోనేషియా మాస్టర్స్ -2022  టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. మహిళల సింగిల్స్ విభాగంలో నేడు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో ఇండోనేషియా క్రీడాకారిణి గ్రెగోరియా మరిష్కా తున్ జుంగ్ పై 23-21; 20-22; 21-11 తేడాతో విజయం సాధించింది.

ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో ఉన్న సింధుకు 30వ స్థానంలో కొనసాగుతున్న గ్రెగోరియా గట్టి పోటీ ఇచ్చింది. మొదటి రౌండ్లో సింధుకు చెమటలు పట్టించిన ఆమె హోరాహోరీగా జరిగిన రెండో రౌండ్ ను గెల్చుకుంది. అయితే మూడో రౌండ్ లో తేరుకున్న సింధు గ్రెగోరియాకు అవకాశం ఇవ్వకుండా సత్తా చాటి 21-11తో సెట్ తో పాటు మ్యాచ్ ను గెల్చుకుంది.

అయితే, మిక్స్డ్ డబుల్స్ లో సుమీత్ రెడ్డి- అశ్వని పొన్నప్ప జోడీ చైనా క్రీడాకారులు ఘెంగ్ సి వీ- హుయాంగ్ ఆ ఖియోంగ్ జంట చేతిలో 21-18;21-13 తేడాతో పరాజయం పాలైంది.

దీనితో ఈ టోర్నీలో ఇండియా ఆశల్నీ సింధు, లక్ష్య సేన్ పైనే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular