సింగపూర్ ఇండోర్ స్టేడియంలో మొదలైన సింగపూర్ ఓపెన్-2022 టోర్నమెంట్ తొలి రౌండ్ లో భారత ఆటగాళ్ళు పివి సింధు, సైనా నెహ్వాల్, అష్మిత చలీహ, హెచ్ ఎస్ ప్రణయ్, మిథున్ మంజునాథ్ లు తమ ప్రత్యర్ధులపై విజయం సాధించారు.
మహిళల సింగిల్స్ లో…
పివి సింధు 21-15;21-11 తో లియాన్నెటన్ (బెల్జియం)పై
అష్మిత చలీహా 21-16;21-11 తో బుసానన్ (థాయ్ లాండ్)పై
సైనా నెహ్వాల్ 21-18;21-14 తో మన దేశానికే చెందిన మాళవిక బన్సోద్ పై విజయం సాధించారు.
పురుషుల సింగిల్స్ లో….
మిథున్ మంజునాథ్ 21-17;15-21;21-18తో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్ పై
హెచ్ ఎస్ ప్రన్నోయ్ 21-13;21-16తో సిట్టికాన్ తమన్సన్ (థాయ్ లాండ్)పై
మిక్స్డ్ డబుల్స్ లో హెచ్.వి. నితిన్- రామ్ పూర్విష జోడీ 21-15;21-14తో ఇజ్రాయెల్ జంట మిషా-స్వెట్లానాపై గెలుపొందారు
మహిళల డబుల్స్ లో పూజా దండు- ఆర్తి సారా సునీల్ జోడీ ప్రత్యర్థులు వైదొలగడంతో వాకోవర్ ద్వారా రెండో రౌండ్ కు చేరుకున్నారు.
కాగా… కిడంబి శ్రీకాంత్ తో పాటు… పారుపల్లి కాశ్యప్, సమీర్ వర్మ తమ ప్రత్యర్థులపై పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు