Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్థాయ్ ఓపెన్: సింధు, శ్రీకాంత్ విజయం

థాయ్ ఓపెన్: సింధు, శ్రీకాంత్ విజయం

THAILAND OPEN 2022: థాయ్ లాండ్ ఓపెన్ లో కిడాంబి శ్రీకాంత్, పివి సింధు శుభారంభం చేశారు. నిన్న జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్  విభాగాల్లో  మహిళల సింగిల్స్ నుంచి అష్మిత చలిహ; మాళవిక బన్సోద్ మాత్రమే రెండో రౌండ్లో ప్రవేశించారు. నేడు జరిగిన మొదటి రౌండ్  పోటీల్లో మాళవిక బన్సోద్ గెలుపొందగా, ఆశ్మిత ఓటమి పాలైంది.

మొన్న ముగిసిన థామస్ కప్ లో  సత్తా చాటిన హెచ్ ఎస్ ప్రన్నోయ్ తొలి రౌండ్ లోనే మలేషియా ఆటగాడు ల్యూ డారెన్ చేతిలో 17-21; 21-15; 15-21 తో ఓటమి పాలయ్యాడు

పురుషుల సింగిల్స్ లో….

  • కిడాంబి శ్రీకాంత్ 18-21; 21-10; 21-16 తేడాతో ఫ్రెంచ్ ఆటగాడు బ్రైస్ లెవేర్దేజ్ పై విజయం సాధించాడు.

మహిళల సింగిల్స్ లో

  • పివి సింధు 21-19;19-21;21-18తో అమెరికా క్రీడాకారిణి లారెన్ లామ్ ను ఓడించింది.
  • మాళవిక బన్సోద్ 17-21; 21-15; 21-11తో ఉక్రెయిన్ కు చెందిన మరిజ ఉలిటినా పై విజయం సాధించింది.

మహిళల డబుల్స్ లో

  • అశ్విని భట్-శిఖా గౌతమ్ జోడీ 21-12; 21-17తో థాయ్ లాండ్ జంటపై గెలుపొందారు

మహిళల సింగిల్స్ లో అస్మిత చలిహా, ఆకర్షి కాశ్యప్, సైనా నెహ్వాల్…… పురుషుల సింగిల్స్ లో సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ ఓటమి పాలయ్యారు.  మిక్స్డ్ డబుల్స్ లో….

  • సుమీత్ రెడ్డి- అశ్వని పొన్నప్ప
  • రాజు మొహమద్ రెహాన్-జమాలుద్దీన్ అనీస్
  • వెంకట్ గౌరవ్ ప్రసాద్- జూహీ దేవాంగన్ జోడీలు ఓడిపోగా….
  • ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో గాయం కారణంగా వాకోవర్ అయ్యారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్