Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: Badminton:  క్వార్టర్స్ కు సింధు, శ్రీకాంత్

CWG-2022: Badminton:  క్వార్టర్స్ కు సింధు, శ్రీకాంత్

కామన్ వెల్త్ గేమ్స్ లో సింగల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, పివి సింధు, మహిళల డబుల్స్ నుంచి గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ జంట క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు.

నేడు జరిగిన మొదటి మ్యాచ్ మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీ చంద్-త్రెసా జాలీ జోడీ 21-2;21-4 తేడాతో మారిషస్ జోడీపై అలవోకగా విజయం సాధించారు

పురుషుల సింగిల్స్ లో  కిడాంబి శ్రీకాంత్ 21-9;21-12తో శ్రీలంక ఆటగాడు అబేయ్ విక్రమ పై విజయం సాధించాడు.

మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-10;21-9 తేడాతో ఉగాండా క్రీడాకారిణి కొబుగాబే పై గెలుపొందింది.

భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పొద్దుపోయిన తరువాత లక్ష్య సేన్, ఆకర్షి కాశ్యప్, పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయి రాజ్ జోడీ తమ పీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లు ఆడనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్