Sunday, January 19, 2025
HomeTrending NewsGanja Smuggling: తంగ‌రాజుకు సింగ‌పూర్‌లో ఉరి

Ganja Smuggling: తంగ‌రాజుకు సింగ‌పూర్‌లో ఉరి

గంజాయి అక్రమ రవాణా కేసులో తంగరాజు ఉరిశిక్ష తప్పించేందుకు చివరి వరకు సాగిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. స్వచ్చంద సంస్థల నుంచి ఐక్యరాజ్య సమితి వరకు ఉరిశిక్ష రద్దు చేయాలని సింగపూర్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వచ్చినా ఫలితం దక్కలేదు. గంజాయి స్మ‌గ్లింగ్ చేసిన కేసులో భార‌తీయ మూలాలు ఉన్న తంగ‌రాజు సుప్పియ్య‌ను ఇవాళ సింగ‌పూర్‌లో ఉరి తీశారు. మ‌ర‌ణ‌శిక్ష అమ‌లును వ్య‌తిరేకిస్తూ అంత‌ర్జాతీయ దేశాలు ఆందోళ‌న చేప‌ట్టినా.. సింగ‌పూర్ మాత్రం ఉరి శిక్ష‌ను అమ‌లు చేసింది. చంగీ ప్రిజ‌న్ కాంప్లెక్స్‌లో 46 ఏళ్ల తంగ‌రాజును ఉరి తీసిన‌ట్లు సింగ‌పూర్ ప్రిజ‌న్స్ స‌ర్వీస్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. ఒక కిలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో 2017లో తంగ‌రాజుపై కేసు న‌మోదు అయ్యింది. 2018లో అత‌నికి శిక్ష‌ ఖ‌రారు చేశారు.

తంగ‌రాజును ఉరి తీయ‌రాదు అని బ్రిటీష్ వ్యాపార‌వేత్త రిచ‌ర్డ్ బ్రాన్స‌న్ త‌న బ్లాగ్‌లో తెలిపారు. డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకున్న స‌మ‌యంలో తంగ‌రాజు అక్క‌డ స‌మీపంలో లేర‌ని ఆయ‌న అన్నారు. అయినా కానీ ఓ అమాయ‌కుడిని ఉరి తీస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తంగ‌రాజును దోషిగా తేల్చార‌ని సింగ‌పూర్ హోంమంత్రిత్వ‌శాఖ తెలిపింది. డ్ర‌గ్స్ డెలివ‌రీ కోసం రెండు మొబైల్ ఫోన్లు వాడార‌ని పోలీసులు తెలిపారు. తంగరాజు ఉరిశిక్ష రద్దు చేసి క్షమా భిక్ష ప్రసాదించాలని సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకోబ్ కి ఆయన కుటుంబ సభ్యులు లేఖ రాసినా ప్రభుత్వం కనికరించలేదు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్