Tuesday, September 24, 2024
HomeTrending Newsనెరవేరిన 30 ఏళ్ళ కల...శ్రీరాంపూర్ లో పట్టాల పంపిణి

నెరవేరిన 30 ఏళ్ళ కల…శ్రీరాంపూర్ లో పట్టాల పంపిణి

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రజల 30 ఏళ్ల కల సాకారమైంది. సింగరేణి భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, కలిసి మర్రిపెల్లి మండలం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహించిన జి.ఓ 76 అమలు ద్వారా 4.వ విడత సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో 273 మంది ప్రజలకు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వ సింగరేణి స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి.. నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు పట్టాల అందించేందుకు జీ.ఓ 76 ద్వారా కృషి చేస్తుందని ఇది ఒక బృహత్తర కార్యక్రమని మంత్రి అన్నారు. సింగరేణి కార్మికుడిగా 26 సంవత్సరాల పాటు పని చేసి విరామం పొందానని, ఈ క్రమంలో సింగరేణి సంస్థ విషయాలపై పూర్తి అవగాహన ఉందని మంత్రి గుర్తు చేశారు. కార్మికులుగా సింగరేణి సంస్థలో పని చేసి, పదవి విరమణ చెందిన తర్వాత కూడా ఆర్థిక సమస్యల కారణంగా సొంతింటిని ఏర్పాటు చేసుకోలేకపోతారని, ఈ సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సింగరేణి సంస్థల క్రమబద్ధీకరణ ద్వారా పట్టాలను అందజేయడం జరుగుతుందన్నారు.  3 విడతలుగా పట్టాలు అందించి ఇప్పుడు 4.వ విడత కార్యక్రమంలో 273 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు, సింగరేణిలో  అసాధ్యమైన విషయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తో పాటు ప్రజలు సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి వాటి పరిష్కారానికి అనేక మార్గాల ద్వారా కృషి చేస్తూ ప్రజలు, కార్మికుల పక్షాన పని చేస్తున్నారని మంత్రి అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, ట్రేని కలెక్టర్ గౌతమి, శాసన మండలి సభ్యులు విఠల్, గ్రంథాలయ ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, లో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్