సింగరేణి రామగుండం లో చోటు చేసుకున్న బొగ్గుగని పైకప్పు కూలిన ప్రమాద దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే సిఎం కెసిఆర్ ఆరా తీసారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను సిఎం ఆదేశించారు. గాయపడిన వారిని తక్షణమే దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
కాగా…. రక్షణ చర్యలు చేపట్టామని, కూలిన శిధిలాలనుంచి కార్మికులను బయటకు తెచ్చే చర్యలు ముమ్మరం చేశామని, మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని, మరి కాసేపట్లో పూర్తి వివరాలు అందించనున్నట్టు సింగరేణి ఎండీ సిఎం కెసిఆర్ కు వివరించారు.