Sunday, September 8, 2024
Homeఅంతర్జాతీయంఅతి త్వరలో స్పుత్నిక్ సింగిల్ డోస్

అతి త్వరలో స్పుత్నిక్ సింగిల్ డోస్

కోవిడ్ వాక్సిన్ విషయంలో మరో ముందడుగు పడింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ ఇప్పుడు సింగిల్ డోస్ ‘సుత్నిక్ లైట్’ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ వినియోగానికి అధికారికంగా అనుమతి కూడా లభించింది.

రష్యాలోని మాస్ వ్యాక్సినేషన్ కింద చేపట్టిన కార్యక్రమంలో ఈ సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ 79.4 శాతం సామర్ధ్యం చూపించింది. 2020 డిసెబర్ 5 నుంచి 2021 ఏప్రిల్ ల మధ్య కాలంలో దీనిపై పరిశోధనలు సాగాయి. రెండు డోసుల వ్యాక్సిన్ కంటే స్పుత్రిక్ లైట్ 80 శాతం సమర్ధతను చూపించటం ఎంతో సానుకూల పరిణామమని స్పుత్నిక్ వి వాక్సినే తయారు చేసిన గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది.

అయితే ఈ సింగల్ డోస్ వాక్సిన్ కు యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇంకా లభించలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్