Sunday, November 24, 2024
HomeTrending NewsInvestments: 23వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర

Investments: 23వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర

రాష్ట్రంలో  రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో రూ. 8,800 కోట్లతో జేఎస్‌ డబ్ల్యూ  కంపెనీ కడప జిల్లాలో  ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన కూడా ఉంది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ధ్యక్షతన క్యాంపు కార్యాలంయలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. దీనిలో కడప స్టీల్ ప్లాంట్ తో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.

కడప స్టీల్ ప్లాంట్:

కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌కు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

రెండు విడతల్లో మొత్తంగా రూ. 8,800 కోట్ల పెట్టుబడి.

మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి.

మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్‌  ఉత్పత్తులు. మొత్తంగా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులు. త్వరలో పనులు ప్రారంభం.

వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని.  వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమని సిఎం జగన్ అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని,  అనుబంధ పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.

అదానీ గ్రీ ఎనర్జీ

1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

రూ. 6,330 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రత్యక్షంగా 4వేలమందికి ఉపాధి.

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో 1000….అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్టులు

2024 డిసెంబర్లో ప్రారంభించి… నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యం.

ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి.

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్

రూ. 8,855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం.

ఎర్రవరం, సోమశిల వద్ద రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్న షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్.

2100 మెగావాట్ల ఉత్పత్తి.. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్లు, సోమశిల వద్ద 900 మెగావాట్ల  ప్రాజెక్టులు

వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారీగా డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్