Saturday, January 18, 2025
Homeసినిమాకొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన 'సార్' మేకర్స్

కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘సార్’ మేకర్స్

ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ద్విభాషా చిత్రం ‘సార్’ సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ‘సార్‘ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు. తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) చిత్ర నిర్మాణం ముగింపు దశలో ఉన్నది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు వాయిదా వేశారు.

వచ్చేఏడాది 2023, ఫిబ్రవరి 17న సార్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు ధనుష్ కళాశాల మెట్లమీద ఎంతో స్టైలిష్ గా కూర్చుని ఉన్న వైనం అభిమానుల్ని అలరిస్తుంది. అలాగే ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన ‘మాస్టారు మాస్టారు‘ గీతం చాట్ బస్టర్స్ లో అగ్రగామిగా నిలవడంతో పాటు, చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ‘సార్‘ పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీద సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు, ఆలోచింప చేస్తాయి.
తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ 17 ఫిబ్రవరి, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్