సౌతాంప్టన్ వేదికగా మరికాసేపట్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటిసి) ఫైనల్ ప్రారంభం కానుంది. ఇండియా- న్యూ జిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రప్రచ వ్యాప్తంగా క్రికెట్ వీరాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎడురుచూసున్నారు. మనదేశం తరఫున ఆడే ఫైనల్ లెవెన్ జట్టును ప్రకటించారు రోహిత్ శర్మకు జోడీగా శుభమన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రెహానే, మిడిలార్డర్ బాధ్యతలు నెరవేరుస్తారు. వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ కొనసాగుతాడు.
ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోగి దిగుతోంది. రవిచంద్రన్ అశ్విన్ కు తోడుగా రవీంద్ర జడేజాను ఫైనల్ లెవెన్ కు ఎంపిక చేశారు. ముగ్గురు పెసర్లు ఇషాంత్ శర్మ, బుమ్రా, మహమ్మద్ షమీ లకు అవకాశం కల్పించారు. మొన్న ప్రకటించిన ఫైనల్ 15 నుంచి హనుమ విహారి, వ్రుద్ధిమాన్ సాహా, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ లను పక్కన పెట్టారు.
హైదరాబాదీ ఆటగాళ్ళు హనుమ విహారీ, సిరాజ్ ఇద్దరూ చారిత్రాత్మక మ్యాచ్ లో ఫైనల్ జట్టులో లేకపోవడం తెలుగు క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశే అని చెప్పవచ్చు.