హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ టీమిండియాతో చేరనున్నాడు. సౌతాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు టి 20 మ్యాచ్ లకు బుమ్రా స్థానంలో సిరాజ్ ను ఎంపిక చేస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జై షా నేడు ఓ ప్రకటనలో వెల్లడించారు.
జస్ ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా ఆడలేదు, అతని స్థానంలో హర్షల్ పటేల్ ను ఫైనల్ లెవెన్ కు ఎంపిక చేశారు.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ తిరువనంతపురంలో సెప్టెంబర్ 28న జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసింది. అక్టోబర్ 2 లో గువహటి. 4న ఇండోర్ లలో మిగిలిన రెండు మ్యాచ్ లూ జరగనున్నాయి.
Also Read : T20 World Cup: గాయంతో బుమ్రా ఔట్