Sunday, January 19, 2025
Homeసినిమా బన్నీ, శిరీష్ మధ్య ఏమైంది..?

 బన్నీ, శిరీష్ మధ్య ఏమైంది..?

అల్లు శిరీష్ గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. అయితే.. నటుడుగా శిరీష్ తొలి సినిమాతో ఫరవాలేదు అనిపించాడు. ఆతర్వాత ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాలతో మెప్పించాడు కానీ.. ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ‘ఏబీసీడీ’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా శిరీష్ కెరీర్ కు ఎంతో కీలకం. అందుకే ప్రమోషన్స్ ను ఒక్కడే తన భుజాల మీద వేసుకొని చేస్తూ వచ్చాడు. అయితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా రావడం విశేషం. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. టీజర్ అండ్ ట్రైలర్ మూవీ పై ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ప్రమోషన్ చేయలేదు. కనీసం ట్విట్టర్ లో ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఇతర హీరోల సినిమాలను కూడా ప్రమోట్ చేసే అల్లు అర్జున్.. తమ్ముడు శిరీష్ ను ఎందుకు పట్టించుకోలేదనే కామెంట్స్ వస్తున్నాయి.

నిజానికి శిరీష్ డెబ్యూ మూవీ గౌరవం నుంచి లాక్ డౌన్ లో చేసిన హిందీ మ్యూజిక్ వీడియో వరకూ ప్రతీ విషయంలోనూ అల్లు అర్జున్ తన తమ్ముడికి సపోర్ట్ గా నిలుస్తూ వచ్చారు. కానీ ఈ ఒక్క సినిమాకే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అందుకే ఇది ఒక టాపిక్ అయింది. అయితే.. శిరీష్ కు బన్నీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అల్లు అభిమానులు అంటున్నారు. వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై అల్లు బ్రదర్స్ స్పందిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్