శివ కార్తికేయన్, సాయిపల్లవి కాంబినేషన్లో మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ,ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు.‘మేజర్’ లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరోసారి దేశం గర్వించే వీరుల కథతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని భరోసా ఇస్తోంది. రాజ్ కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శివకార్తికేయన్‌ను అతని అభిమానులు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు.
‘గట్స్ అండ్ గోర్’ దేశభక్తి కథాంశంతో రూపొందనున్న చిత్రం. ఈ చిత్రంలో శివకార్తికేయన్ కు జోడిగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లోని అద్భుతమైన లొకేషన్లలో రెండు నెలల షెడ్యూల్‌తో ప్రారంభమైయింది. నిర్మాతలు కమల్ హాసన్, మిస్టర్.ఆర్.మహేంద్రన్, శ్రీ.శివకార్తికేయన్, ఎం.ఎస్.సాయి పల్లవి, శ్రీ.రాజ్‌కుమార్ పెరియసామి, శ్రీ.జి.వి.ప్రకాష్, కో-ప్రొడ్యూసర్ శ్రీ వకీల్. ఖాన్, మిస్టర్ లడా గురుదేన్ సింగ్, జనరల్ మేనేజర్ హెడ్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఇండియా & మిస్టర్. నారాయణన్, సిఈవో, RKFI. సమక్షంలో చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా అనౌన్స్ చేశారు.