Six Advisers To The Rajasthan Cm :
రాజస్థాన్ ప్రభుత్వ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సజావుగా జరిగింది. ఆదివారం సాయంత్రం జైపూర్ రాజభవన్ లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులది క్యాబినెట్ హోదా కాగా నలుగురు సహాయమంత్రులుగా ఉన్నారు.
క్యాబినెట్ మంత్రులలో హేమరాం చౌదరి, మహేంద్ర జీత్ సింగ్ మలవియ, రాంలాల్ జాట్, మహేష్ జోషి, విశ్వేంద్ర సింగ్ , రమేష్ మీనా, మమత భుపేష్ బైరవ, భజన్ లాల్ జాతవ్, తికరాం జులి, గోవింద్ రాం మేఘవాల్, శకుంతల రావత్ లు ఉన్నారు. జహిదా ఖాన్, బ్రిజేంద్ర సింగ్ ఓల, రాజేంద్ర గుడ్డ మరియు మురారి లాల్ మీనా సహాయ మంత్రులుగా పదవీ స్వీకారం చేశారు.
ఈ దఫా మంత్రి వర్ఘంలో అందరిని సంతృప్తి పరిచేందుకు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఆరుగురు ఎమ్మెల్యేలను సలహాదారులుగా నియమించారు. ఆరుగురిలో జితేంద్ర సింగ్, బాబులాల్ నగర్, రాజ్ కుమార్ శర్మ , సన్యం లోధ , రాం కేశ్ మీనా, డానిష్ అబ్రార్ ఉన్నారు. మంత్రివర్గంలో అందరికి అవకాశం ఇచ్చేందుకు అవకాశం లేకపోవటంతో సలహాదారుల రూపంలో కొత్త పదవులు సృష్టించారు.
Also Read : రాజస్థాన్ మంత్రుల రాజీనామా