Six Months Break For Char Dham Yatra :
హిమాలయ పర్వతాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సాగే చార్ ధాం యాత్ర ఈ రోజు నుంచి నిలిపివేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శీతాకాలం ప్రారంభం కావటంతో గంగోత్రి,యమునోత్రి, భద్రినాథ్, కేదారినాథ్ పుణ్యక్షేత్రాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. నాలుగు పుణ్యక్షేత్రాల్లో రాత్రిపూట మంచు పడుతోంది. మరికొద్ది రోజుల్లో మంచు తీవ్రత పెరుగుతుందని దీంతో ఆరు నెలల పాటు చార్ ధాం యాత్ర నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
గంగోత్రికి భక్తుల రాకపోకలను నిన్నటి నుంచి నిలిపివేయగా యమునోత్రి, కేదారినాథ్ లో ఈ రోజు భక్తులకు ఆఖరుగా దర్శనం లభిస్తుంది. భద్రినాథ్ కు మాత్రం ఈ నెల 20వ తేది వరకు భక్తులను అనుమతిస్తారు. ఈ సందర్భంగా గంగోత్రి,యమునోత్రి, కేదారినాథ్ లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోవిడ్ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 16వ తేదిన చార్ ధాం యాత్రకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు డోసుల టీకా వేసుకున్న వారిని యాత్రకు అనుమతించారు. కోవిడ్ నిభంధనల ప్రకారం యాత్రకు అనుమతించగా అక్టోబర్ 22 వ తేది నాటికి రెండు లక్షల మంది భక్తులు చార్ ధాం యాత్రలో పాల్గొన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
Must Read : కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ