Sunday, January 19, 2025
Homeసినిమాఈ వారం బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలిచేది ఎవరు..?

ఈ వారం బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలిచేది ఎవరు..?

ఈ వారం మూడు  క్రేజీ సినిమాలు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. రామ్, బోయపాటి కాంబో మూవీ ‘స్కంద’, శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెదకాపు 1’, లారెన్స్, కంగనా కాంబినేషన్లో తెరకెక్కిన ‘చంద్రముఖి 2’. ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేశాయి. ఇందులో విజేతగా నిలిచేది ఎవరు..?

స్కంద సినిమా విషయానికి వస్తే.. రామ్, బోయపాటి కలిసి చేసిన పాన్ ఇండియా మూవీ. ఇందులో రామ్ కు జంటగా శ్రీలీల నటించింది. ఈ ముగ్గురికీ ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ లో అంచనాలను పెంచేసింది. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడం.. రామ్ ను ఫుల్ మాస్ గా చూపించడంతో ఇది పక్కా హిట్ అనే టాక్ వచ్చింది. పైగా ఈ రేంజ్ మాస్ మూవీ వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు శ్రీలీల మంచి ఫామ్ లో ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. స్కందకు పాజిటివ్ గానే కనిపిస్తుంది. ఈ నెల 28న స్కంద రిలీజ్ కానుంది.

సెన్సిబుల్ చిత్రాలు తీసే శ్రీకాంత్ అడ్డాల రూటు మార్చి తీసిన మాస్ మూవీ ‘పెదకాపు 1’. ఈ సినిమా ద్వారా విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇదో పొలిటికల్ డ్రామా. కొత్త హీరో పై 45 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇది. టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే.. ఇందులో బలమైన కథ ఉందనే ఫీలింగ్ అందరికీ కలిగించింది. ఇందులో శ్రీకాంత్ అడ్డాల నటించడం విశేషం. 1982 నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు.

చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్లో పి.వాసు తెరకెక్కించారు. రజినీకాంత్ ప్లేస్ లో రాఘవ లారెన్స్ నటించాడు. కంగనా రనౌత్ చంద్రముఖి పాత్ర పోషించింది. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. లాస్ట్ థర్టీ మినిట్స్ బాగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 28న చంద్రముఖి 2 రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాకి హిట్ టాక్ వచ్చినా రెండు వారాలు పాటు సందడి చేయడం ఖాయం. మరి.. ఈ మూడు చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్