Sunday, January 19, 2025
HomeTrending Newsశ్రీహరికోట నుంచి తొలి ప్రైవేటు రాకెట్ విజయవంతం

శ్రీహరికోట నుంచి తొలి ప్రైవేటు రాకెట్ విజయవంతం

శ్రీహరికోట …సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగించిన విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిన రాకెట్, ఇస్రో చేపట్టిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అవటంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. భారత అంతరిక్ష చరిత్రలో ఇది కొత్త అధ్యాయంగా నిలువనుంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రధాని మోడీ ప్రోత్సాహించారు. టీం బాగా పనిచేస్తుంది.. స్కై రూట్ ఏరో స్పేస్ సంస్థ అధినేతలు పవన్ భరత్ లకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.

అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ కీర్తిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ అనే ప్రైవేటు సంస్థ
భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఈ రోజు తొలి అడుగు పడింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఈ చారిత్రాత్మక ప్రయోగానికి వేదికైంది, ఈరోజు ఉదయం 11:30 గంటలకు షార్ లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెల్లింది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చారు. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విక్రం సబార్బిటల్(VKS)అనే రాకెట్ ను అభివృద్ధి చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్