Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్స్మృతి మందానా రికార్డు

స్మృతి మందానా రికార్డు

భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మందానా వన్డేల్లో ఓ రికార్డు సొంతం చేసుకుంది. వేగంగా మూడువేల పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గా, మూడో భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.

మహిళా క్రికెట్ లో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ ఫీట్ ను 88 ఇన్నింగ్స్ లో సాధించగా స్మృతి 76 వన్డేల్లోనే మూడు వేల మైలురాయిని దాటింది. 2013లో వన్డేల్లో అడుగు పెట్టిన స్మృతి ఐదు సెంచరీలు, 24 అర్ధ సెంచరీలతో 85 స్త్రయిక్ రేట్ తో, 43 పరుగుల యావరేజ్ తో మూడు వేల పరుగులు చేసింది. నేడు ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో 40 పరుగులు చేసిన స్మృతి స్కోరు 17 వద్ద మూడు వేల మార్క్ చేరుకుంది.

భారత పురుషుల, మహిళల క్రికెట్  ఆటగాళ్ళలో స్మృతి మూడో వ్యక్తిగా నిలిచింది. శిఖర్  ధావన్ 72, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించారు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 22 మంది మహిళా క్రికెటర్లు మూడు వేల మైలురాయిని దాటగా, వేగంగా దాటిన వారిలో స్మృతి మందానా కు మూడో స్థానం. బెలిండా క్లార్క్ 62, మెగ్ లన్నింగ్ 64 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్