Major -Shobhita: వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్‘. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మేజర్’ లో కీలక పాత్ర పోషించిన నటి శోభితా ధూళిపాళ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
‘గూడచారి’ సినిమా చేస్తున్నపుడే హీరో అడవి శేష్ గారికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఒక ఆరాధన భావం గమనించాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం పై శేష్ ఎప్పటి నుండో రీసెర్చ్ చేస్తున్నారు. గూడచారి షూటింగ్ లో సందీప్ జీవితం గురించి చాలా ఆసక్తికరమైన సంగతులు చెప్పేవారు. ఐతే ఈ సినిమాలో నేను కూడా చేస్తానని అప్పుడు తెలీదు. ఒక విధంగా ఈ కథకి నేనే ఫస్ట్ ఆడియన్. ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది.
నాకూ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనే వుంది. ఈ గ్యాప్ కి కరోనా ఒక కారణంగా భావిస్తా. కరోనా లేకపోతె మేజర్ ఏడాది క్రితమే వచ్చేది. ఐతే సౌత్ లో కురుప్ సినిమా చేశా. అలాగే మణిరత్నం గారితో పొన్నియన్ సెల్వన్ చేస్తున్నా. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నా కానీ తెలుగులోనే సరిగ్గా కుదరడం లేదు. అయితే రానున్న రోజుల్లో తెలుగులో కూడా ఎక్కువ సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను.
మేజర్ లో ప్రమోద అనే పాత్రలో కనిపిస్తా. సినిమాలో ఒక పక్క సందీప్ జీవితం చూపిస్తూ.. మరో పక్క 26/11 దాడులు, తాజ్ ఇన్సిడెంట్ ని సమాంతరంగా చూపిస్తారు. నేను 26/11 ఎటాక్స్ లో బందీగా కనిపిస్తా. భయం ,ఏడుపు , ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ .. ఇలా బోలెడు కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. భావోద్వేగాలలో చాలా బరువైన పాత్ర. నిజ జీవితంలో ఒక వ్యక్తి దాడులని, బాధని ఎదుర్కొన్నారు. కాబట్టి కేవలం సినిమాటిక్ గా కాకుండా ఒక బాధ్యతతో చేసిన పాత్ర ఇది.
మహేష్ గారి బ్యానర్ లో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. మహేష్ బాబు గారిది గ్రేట్ కెరీర్. అలాంటి సూపర్ స్టార్ తన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ లో మొదటిసారి బయట సినిమా చేశారు. ఇది మాకు గొప్ప ఎనర్జీ ఇచ్చింది. కరోనా సమయంలో చాలా అందోళన పడ్డాం. ఓటీటీకి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాం. కానీ మహేష్ బాబు గారు మాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. ‘ఇది థియేటర్ సినిమా.. ఎట్టి పరిస్థితిలో థియేటర్ లోనే విడుదలౌతుందని’ చెప్పారు. ఆయన మార్గదర్శకం, ప్రోత్సాహం మాలో గొప్ప నమ్మకాన్ని నింపింది. మంచి నిర్మాణ సంస్థలో పని చేశాననే ఆనందం వుంది.
నాకు హిస్టారికల్ పాత్రలు చేయాల ని వుంది. పొన్నియన్ సెల్వన్ తో ఆ ఆకాంక్ష కొంతవరకూ తీరింది. అందులో నా పాత్ర బావుంటుంది. నేను క్లాసికల్ డ్యాన్సర్ ని. మొదటిసారి అందులో డ్యాన్స్ ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హ్యాపీగా వుండే పాత్రలు చేయాలని వుంది. కానీ చాలా వరకూ సీరియస్ పాత్రలే వచ్చాయి. మొదట్లో నాకు పాత్రని ఎంచుకునే అవకాశం వుండేది కాదు. వచ్చిన పాత్రలో మంచిదేదో ఎంచుకొని చేశాను. ఐతే ఇప్పుడు అన్నీ రకాల పాత్రలు చేయడానికి దర్శక, నిర్మాతలు, ప్రేక్షకుల నమ్మకాన్ని పొందననే భావిస్తున్నాను” అన్నారు.
Also Read : ‘మేజర్’ గ్రేట్ మూవీ అవుతుంది – మహేష్ బాబు