Tuesday, September 17, 2024
Homeసినిమాఈ నెల 15న వస్తున్న ‘సోదర సోదరీమణులారా…’

ఈ నెల 15న వస్తున్న ‘సోదర సోదరీమణులారా…’

కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’. 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకట్టుకునే టైటిల్, ఎమోషనల్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతుంది. టైటిల్, పోస్టర్ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామా గా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్ కలిగించింది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ ‘సోదర సోదరీమణులారా..’ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్లలో సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి వర్ధన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మోహన్ చారి కెమెరామెన్ గా, పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఈ చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్