సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించి చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా హీరో సోహైల్ లక్కీ లక్ష్మణ్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
వర్క్ పరంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక పర్సనల్‌గా చూస్తే.. రెస్ట్ ఉండటం లేదు. ఇక్కడ రెండు విషయాలున్నాయి. కామన్ మ్యాన్‌గా ఉన్నప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటాయి. అదే బిగ్‌బాస్, సినిమానో ఏదో ఒక చిన్నదో, పెద్దతో సెలబ్రిటీ స్టేటస్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం కష్టమైపోతుంది. ఇక ప్రొషెషనల్‌గా చూస్తుంటే.. సినిమాల పరంగా, కంటెంట్ పరంగా పాటలు, టీజర్, ట్రైలర్ విడుదలైతే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. పర్సనల్‌గా అయితే మీడియాతో ఎలా మాట్లాడాలి.. కెమెరా ముందు ఎలా ఉండాలనే విషయాలను కాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ నేను ఒరిజినల్‌గా ఉండాలని అనుకుంటున్నాను.
ఇక్కడ కూడా యాక్ట్ చేయాలంటే నా వల్ల కావటం లేదు. అదొక్కటే నాకు మైనస్ అవుతుంది నాకు. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను. కానీ ఇంటర్వ్యూస్‌లో మాట్లాడే సందర్భంలో లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడటం నాకు రావటం లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కొంత మంది నెగటివ్‌గా తీసుకుంటున్నారు. 100 మందిలో 20 మంది నెగిటివ్‌గా తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసినప్పుడు కింద కామెంట్స్ పాజిటివ్‌గా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కావాలనే నెగిటివ్ కామెంట్ పెడితే బాగోదు.
లక్కీ లక్ష్మణ్ కంప్లీట్ క్లీన్ కామెడీ. ఎక్కడా వల్గారిటీ ఉండదు. నేను సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా కనిపిస్తాను. మన ఫ్యామిలీతో చూసేటప్పుడు అదే ఈ సీన్ వచ్చిందేందని తల తిప్పుకునేలా ఉండదు. అందరూ కలిసి సినిమా చూడొచ్చు. బిగ్ బాస్‌లో నేను గడిపిన 104 డేస్ ఒక ఎత్తు అయితే 105 రోజున చిరంజీవి గారు, నాగార్జున గారు ఏదైతే నా గురించి మాట్లాడి మోటివేట్ చేశారో అవి నాకు చాలా ప్లస్ అయ్యాయి. అప్పుడు ఫినాలేకు వెళ్లడం నిజంగా నా లక్. దాని వల్ల బయటకు రాగానే అందరూ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. లక్కీ లక్ష్మణ్ సినిమా విషయంలో యాక్టర్ నాతో పాటు ఇతర టీమ్.. డైరెక్టర్ అభి గారు సహా ఇతర టెక్నికల్ టీమ్ అందరూ మా వంతు మంచి ప్రయత్నాన్ని చేశాం. ఇండస్ట్రీలో అందరిలాగానే మంచి హిట్ కొట్టాలనే సినిమా తీశాం. ఇక ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఓ సీనియర్ ప్రొడ్యూసర్‌కి ఈ సినిమాను చూపించాను. ఆయన సినిమా చూసిన తర్వాత సోహైల్ నువ్వు సేఫ్ అని అన్నారు. ఆ మాట నాకు చాలనిపించింది.
ఇప్పుడు నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి. నటుడిగా నాలో విషయం లేకపోతే ఇన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కావు. ఎస్.వి.కృష్ణారెడ్డి వంటి డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చేవారు కాదు. కోట్ల ఖర్చు పెట్టి నాతో సినిమాలు చేస్తున్నారంటే నేను సినిమాల్లో పనికొస్తాననే నమ్మకం కలిగింది. ఎస్.వి.కృష్ణారెడ్డి గారు ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాలో అవకాశం ఇస్తానన్నప్పుడు నేను నమ్మలేదు. రెండు సార్లు కథ విన్నాను. నిర్మాతలు ఎన్ని విషయాలు చెప్పినా.. కృష్ణారెడ్డి గారు నేనే హీరోగా ఉండాలని పట్టుబట్టి ఛాన్స్ ఇచ్చారు. ఆ విషయంలో ఆయన మేలు ఎప్పటికీ మరచిపోలేను. ఈ సినిమాలో చేయటానికి కారణం.. నా లక్ అని మరోసారి చెప్పగలను.