Saturday, November 23, 2024
HomeTrending Newsఓఆర్‌ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌

ఓఆర్‌ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌

హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంగళవారం నానక్ రామ్ గూడ వద్ద మంత్రి భూమిపూజ చేశారు. మొదటి దశలో మొత్తం 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. 16 మెగా వాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ రూఫ్‌ను ఏర్పాటు చేస్తారు. 2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని హెచ్ఎండీఏ (HMDA) లక్ష్యంగా పెట్టుకుంది. నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు… నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం జరుగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు.

సౌత్ కొరియాలో మాదిరిగా ఇక్కడ సైకిల్ ట్రాక్ నిర్మిస్తున్నామని, ఫిజికల్ ఫిట్నెస్ కోసం సైక్లింగ్ ని ఎంకరేజ్ చేస్తూ.. దీన్ని ఎల్లప్పుడూ ఓపెన్ గా ఉంచుతామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. ఇతర దేశాల్లో ఉన్న అన్నిటిని పరిశీలించి నిర్మాణం మొదలు పెట్టామని, ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఈవెంట్స్ కూడా ఇక్కడ నిర్వహించడానికి అనుగుణంగా నిర్మాణం ఉంటుందన్నారు. సైక్లింగ్ రెంటల్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్రోలో సైకిల్స్ తీసుకోవడానికి అనుమతించాలని విన్నపాలు వస్తున్నాయని, ఆ దిశగా పరిశీలిస్తున్నామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్