Sunday, January 19, 2025
HomeసినిమాAdi Purush: 'ఆది పురుష్'లో కొత్తగా కనిపిస్తున్నవి ఇవే!

Adi Purush: ‘ఆది పురుష్’లో కొత్తగా కనిపిస్తున్నవి ఇవే!

ప్రభాస్ కథానాయకుడిగా .. రామాయణ కథను ‘ఆది పురుష్’గా రూపొందించారు. ఇందుకోసం భారీ నిర్మాణ సంస్థలు బరిలోకి దిగాయి. ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. జూన్ 16వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, విజువల్స్ పరంగా బాగుంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ పాత్రను చూపించిన సందర్భాలు బాగున్నాయి.

అయితే శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ కాస్త కొత్తగా కనిపిస్తుంది. రామాయణం నేపథ్యంలో తెలుగులో  ఇంతవరకూ చాలానే సినిమాలు వచ్చాయి. శ్రీరాముడి రూపం .. ఆయన మాట .. ఆయన నడక ఇలాగే ఉంటాయేమో అనిపించేలా ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల హృదయాలపై ఒక ముద్ర వేశారు. తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకూ మీసాలు కలిగిన రాముడిని ఎవరూ చూపించలేదు. ఇక శ్రీరాముడిని నార వస్త్రాలతోనే చూపించారు తప్ప, ఆయన వక్షస్థలాన్ని కప్పుతూ ఎలాంటి కవచాన్ని చూపించలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తున్నాడు.

ఇక శ్రీరాముడు ఎంతటి పరాక్రమవంతుడో .. అంతటి శాంతమూర్తి. ఆయన తన జీవిత కాలంలో వృథాగా ఒక్క మాట మాట్లాడలేదనీ .. ప్రసన్న వదనంతోనే కనిపించేవాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ఈ సినిమాలో రాముడి పాత్ర వానర సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ గట్టిగా మాట్లాడటం చూపించారు. ఇక రావణుడి పాత్ర లుక్ కూడా ఇంతవరకూ తెలుగు ప్రేక్షకులు తెరపై చూస్తూ వచ్చినదానికి భిన్నంగా ఆవిష్కరించడం కనిపిస్తుంది. మరి ఈ సినిమాకి తెలుగు ఆడియన్స్ ఎంతవరకూ కనెక్ట్ అవుతారనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్