Sunday, January 19, 2025
Homeసినిమాటెన్షన్ లో ఆర్సీ 15 టీమ్

టెన్షన్ లో ఆర్సీ 15 టీమ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. ఈ మూవీ రామ్ చరణ్‌ 15వ చిత్రం కాగా దిల్ రాజు కు 50వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్‌ లేకుండా వేరే నటీనటుల పై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. జనవరి రెండో వారం నుంచి చరణ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు.

ఇదిలా ఉంటే… ఈ సినిమాకు లీకుల బెడద తప్పట్లేదు. ఇంతకు ముందే ఈ సినిమాకు సంబంధించి అంతగా స్పష్టత లేని ఫొటోలు కొన్ని లీకయ్యాయి. తాజాగా #RC15 కొన్ని ఫొటోలతో పాటు వీడియోలు కూడా లీక్ అయ్యాయి. దీంతో చిత్రయూనిట్ టెన్షన్ ఫీలవుతుంది. ఈ చిత్రం ఎక్కువగా రాజమండ్రి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతకు ముందే అక్కడ కొన్ని రోజులు చిత్రీకరణ జరిపారు. తాజాగా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టగా.. అందుకోసం ఓపెన్ ఏరియాలో వేసిన సెట్ తాలూకు వీడియోతో పాటు చరణ్ కొత్త లుక్ తాలూకు ఫొటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మెగా అభిమానులే కొందరు అత్యుత్సాహంతో ఫొటోలు, వీడియోలు లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో చిత్ర బృందం వెంటనే స్పందించింది. ఈ ఫొటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే ట్విట్టర్ అకౌంట్లు లేచిపోతాయని, కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. లీకైన ఫోటోల్లో చరణ్‌ పల్లెటూరి యువకుడుగా కనిపిస్తున్నారు. అలాగే ఓ వేదిక పై చరణ్‌ మాట్లాడుతుండగా పక్కన శ్రీకాంత్ ఉన్నారు. వీరిద్దరి గెటప్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. దీంతో ఈ మూవీ పై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ పూర్తయ్యింది. జనవరి నుంచి కంటిన్యూగా షూటింగ్ చేసి మార్చికి కంప్లీట్ చేయాలనేది ప్లాన్. సమ్మర్ లో భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్