Saturday, January 18, 2025
HomeసినిమాMahesh Babu: మహేశ్ బాబు నుంచి ఇవి నేర్చుకోవలసిందే!

Mahesh Babu: మహేశ్ బాబు నుంచి ఇవి నేర్చుకోవలసిందే!

బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పుడు .. ఒక సూపర్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎదురయ్యే సవాళ్లు కూడా బలంగానే ఉంటాయి. అలాంటి సవాళ్ల మధ్య కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిసుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొద్దుగా ముద్దుగా కనిపించే మహేశ్ కి సంబంధించిన పాటలను అప్పట్లో సుశీల పాడేవారు. అంత లేతగా కనిపించే మహేశ్ బాబు, హీరోగా తనని తాను మార్చుకుని రంగంలోకి దిగిన తీరు చూసి అంతా ఆశ్చర్యపోయారు.

సాధారణంగా మంచి కలర్ ఉన్న హీరోలు మాస్ ఇమేజ్ తెచ్చుకోవడం కష్టం. కానీ అప్పట్లో కృష్ణ ఎంచుకున్న కథలు ఆయనకు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ జనరేషన్ లో దానిని కొనసాగించడం అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు కథలు .. కాన్సెప్టులు మారిపోయాయి. పైగా హీరోగా చేసిన ఫస్టు సినిమాతోనే యూత్ లో మహేశ్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దానిని మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి మహేశ్ బాబు తనని తాను ఎంతగా మార్చుకున్నాడనేది తన కెరియర్ గ్రాఫ్ ను చూస్తే అర్థమవుతుంది.

కథపై క్లారిటీ లేకుండా మహేశ్ బాబు సెట్స్ పై అడుగుపెట్టడు. సెట్స్ పై కథలో .. డైలాగ్స్ లో మార్పులు చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. షెడ్యూల్స్ ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమే జరగాలి .. అలాగే రిలీజ్ డేట్స్ మార్చడానికి కూడా ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే మరో ప్రాజెక్టు రిలీజ్ ను ఆయన ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుడుకోడు. అలాగే తనకి ఒకసారి హిట్ ఇచ్చిన దరకులపై ఆయనకి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. వాళ్లకి మరో ఛాన్స్ ఇవ్వడానికి ఆయన వెనుకాడరు. ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన సక్సెస్ కి ఇవన్నీ కారణాలుగానే చెప్పుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్