Sunday, January 19, 2025
HomeTrending Newsవెంటనే గరీబ్ యోజన వ్వాలి: సోము వీర్రాజు

వెంటనే గరీబ్ యోజన వ్వాలి: సోము వీర్రాజు

గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తోన్న బియ్యాన్ని నాలుగు నెలలుగా ఏపీలో ఇవ్వకపోవడం సరికాదని, వెంటనే బియ్యాన్ని సరఫరా చేయాలని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆంధ్ర ప్రదేశ్ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సివిల్ సప్లై ఆఫీసుల వద్ద ధర్నా చేపట్టింది. గుంటూరులో జరిగిన ధర్నాలో సోము పాల్గొన్నారు.  ప్రతినెలా 15కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా మూడు నెలలుగా ఆపేశారని, రేపు కూడా ఇవ్వకపోతే నాలుగు నెలలు అవుతుందని చెప్పారు. ప్రభుత్వం దీనిపై కుంటిసాకులు చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందిచకపోతే 18న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపడతామని, తర్వాత గ్రామస్థాయి వరకూ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో 1.40 లక్షల కార్డులు ఉండగా కేంద్రం 86 లక్షల కార్డులకే కేంద్రం బియ్యం ఇస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వం చూపిస్తున్న కార్డుల సంఖ్య ఎన్నైనా ఉండవచ్చని, నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 86 లక్షల కార్డులే  లెక్కలోకి వస్తాయన్నారు. మిగిలినవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని సోము విశ్లేషించారు. కేంద్రం పిఎం కిసాన్ యోజన కింద 55లక్షలమందికి పెట్టుబడి సాయం ఇస్తుంటే రాష్ట్రం కౌలు రైతులకు కూడా ఇస్తోంది కాదా, అలాగే బియ్యం కూడా పంపిణీ చేయాలని సూచించారు.  ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే కేంద్రం ఇవ్వలేదని అబద్ధాలు చెబుతున్నారని సోము మండిపడ్డారు.  కేంద్ర అధికారులను తాము సంప్రదిస్తే దీనికి సంబంధించిన నిధులు విడుదల చేశామని చెప్పారని వెల్లడించారు. గరీబ్ కళ్యాణ్  బియ్యం కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

Also Readజగన్ అమలు చేసేవి మా పథకాలే: నడ్డా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్