Somu Suggested Ap Government To Constitute New Awards :
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పుష్పశ్రీ అవార్డులు పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యంగ్యంగా అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారికి కూడా పద్మ అవార్డులు ఇస్తున్నారని, రాష్ట్రంలో మాత్రం బూతులు మాట్లాడుతున్న మంత్రులకు బూతు పుష్పాలు లేదా ఎర్రి పుష్పాల అవార్డులు ఇవ్వాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అన్ని రాష్ట్రాలకు సహాయం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మేరకు తగ్గించాలని తాము డిమాండ్ చేస్తే అధికార పార్టీ నేతలు, మంత్రులు అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని సోము విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై ఆదాయం సంపాదించాలని కేంద్రం భావిస్తే సోలార్,ఎలక్ట్రానిక్ వాహనాలు ఎందుకు తయారు చేస్తుందని ప్రశ్నించారు.
బద్వేల్ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీని దేకించామని, డిపివోలను అడ్డంపెట్టుకొని ఎన్నికల్లో గెలిచారని వీర్రాజు దుయ్యబట్టారు. బద్వేల్ ఉపఎన్నికపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీజేపీ తోక పార్టీ అయితే వైసీపీ పరిస్థితి ఏంటని నిలదీశారు. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని మంత్రులు తెలుసుకోవాలన్నారు. ఏపీ మంత్రులు భారతదేశంలో ఉన్నారా పాకిస్తాన్ లో ఉన్నారా? అని మండిపడ్డారు.
నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయలేదని, ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, న్యాయం చెయ్యమని అడిగితే విద్యార్ధులను పోలీసులతో కొట్టిస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే అది మీపైనే పడుతుందన్నారు. పెట్రోల్ ,డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై సీఎం, సీఎస్ కు లేఖ రాస్తానని సోము అన్నారు. డీజిల్, పెట్రోల్ రేట్లలో కు పక్కరాష్ట్రానికి, ఆంధ్ర ప్రదేశ్ కు 12రూపాయల తేడా ఉందని వివరించారు. జగన్ అన్న కానుకలు అన్ని ప్రజలపై వేసిన భారాల నుంచి ఇస్తున్నవేనని స్పష్టం చేశారు.
Also Read : ఇకపై ‘పీపుల్స్ పద్మ’ అవార్డులు : మోడీ