విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి ఖండించింది. ఎన్టీఆర్ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పేరు ఎలా పెడతారని ప్రశ్నించిన సోము… రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్ టి ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. వైఎస్ తనకు హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం లాంటి కీలక పదవులు ఇచ్చి గౌరవించారని గుర్తు చేస్తుకున్నారు. కానీ ఎన్ టి ఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: అటల్ జీ బాటలోనే మోడీ: సోము వీర్రాజు