Saturday, January 18, 2025
HomeTrending Newsఈనెల 21న విజయవాడలో సభ: వీర్రాజు

ఈనెల 21న విజయవాడలో సభ: వీర్రాజు

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై ఈనెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని, ఈ ప్రభుత్వం ప్రజల ఆదరణ వేగంగా కోల్పోతోందని వ్యాఖ్యానించారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో  భాగంగా ఈరోజు కర్నూలు నగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో  మాజీ ఎంపీ టిజి వెంకటేష్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డిలతో కలిసి వీర్రాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనగా నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, నగరాల్లో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తునున్నామని, ఈ నెల 9న మొదలైన ఈ ఉత్సవాలు నేడు ముగుస్తున్నయని తెలిపారు.   రేపు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తామని, ఆగష్టు 13 నుండి 15 వరకూ ఈ జెండా ప్రతి ఇంటిపై ఎగరాలని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్