Saturday, January 18, 2025
Homeజాతీయంఫలితాలపై పోస్టుమార్టం: సోనియా

ఫలితాలపై పోస్టుమార్టం: సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్న్లికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి వుందని నాయకులకు హితవు పలికారు. ఢిల్లీ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. దేశంలో కోవిడ్ పరిస్థితి, ఇటివలి ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఫలితాలపై లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం, ఆత్మ పరిశీలన అవసరమని సోనియా అన్నారు. పశ్చిమ బెంగాల్లో పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఫలితాలపై ఆయా రాష్ట్రాల ఇన్ ఛార్జ్ లు నివేదిక ఇవ్వాలని కోరారు.

అస్సాం, కేరళ రాష్ట్రాల్లో ఇంకా బాగా పనిచేసి వుంటే ఫలితం రాబట్టి ఉండేవాళ్లమని అభిప్రాయపడ్డారు. ఫలితాలను సమీక్షించుకుని భవిష్యత్ లో మరింత కష్టపడాలని సూచించారు. తమిళనాడు ఫలితాలు కాస్త ఊరట కలిగించాయన్నారు. జూన్ 23న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరపాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది.

కోవిడ్ రెండో దశ విషయంలో నిపుణులు ఇచ్చిన సలహాలను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, వాక్సినేషన్ అందించడంలో కూడా విఫలమయ్యారని సోనియా గాంధీ విమర్శించారు. కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్