Sunday, January 19, 2025
HomeTrending Newsమూడో రోజు ఈడి విచారణకు సోనియాగాంధీ

మూడో రోజు ఈడి విచారణకు సోనియాగాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడవ రోజు ఈడీ ఎదుట కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. సోనియా వెంట కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా వెళ్లారు. ఇప్పటికే సోమ, మంగళవారాల్లో వరుసగా ఆమెను ఈడీ ప్రశ్నించింది. నిన్న సుమారు 6 గంటలపాటు సోనియా గాంధీపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ చేసిన రూ. 90 కోట్ల అప్పును యంగ్ ఇండియాకు ట్రాన్స్ ఫర్ చేయడంపై ఈడీ ప్రశ్నలు వేసింది.

యంగ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న సోనియాకు 38 శాతం వాటా ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై అధికారులు కూపీ లాగారు. ఈ రెండు రోజుల్లో సోనియాకు దాదాపు 55 ప్రశ్నలు సంధించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు సోనియాపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. సత్యాగ్రహ పేరుతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్ లో ఆందోళనలు చేపట్టారు. రైలును ఆపేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ విధించారు. బారికేడ్లతో అక్బర్ రోడ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటితో సోనియా ఈడీ విచారణ ముగియనున్నట్టు తెలుస్తోంది.

Also Read ఈడీ ఆఫీస్​కు రాహుల్ గాంధి

RELATED ARTICLES

Most Popular

న్యూస్