టి20 వరల్డ్ కప్ లో సంచలన విజయాలతో సెమీ ఫైనల్స్ కు దూసుకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ కీలక మ్యాచ్ లో చేతులెత్తేసింది. నేడు జరిగిన మొదటి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ ను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. సౌతాఫ్రికా బౌలింగ్ దెబ్బకు 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆఫ్ఘన్ ఆలౌట్ కాగా, ఈ లక్ష్యాన్ని కేవలం 8.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.
ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ తొలి ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది. జట్టులో అజ్మతుల్లా చేసిన 10 పరుగులే హయ్యస్ట్ స్కోరు కావడం గమనార్హం. మొత్తం ముగ్గురు డకౌట్ అయ్యారు.
సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ , శంషి చెరో 3; రబడ, నార్త్జ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో దిగిన సౌతాఫ్రికా 5 పరుగుల వద్ద ఓపెనర్ డికాక్(5) వికెట్ కోల్పోయింది. హెండ్రిక్స్ -29; కెప్టెన్ మార్ క్రమ్-23 పరుగులతో అజేయంగా నిలిచారు.
మార్కో జాన్సెన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
టి20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా ఫైనల్స్ కు చేరడం ఇది తొలిసారి.
ఈ సాయంత్రం జరిగే మరో సెమీఫైనల్లో ఇండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
ఈనెల29న ఫైనల్స్ జరగనుంది.