Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా గెలుపు

మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా గెలుపు

SA Beat England: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికాకు ఇది మూడో విజయం కాగా, ఇంగ్లాండ్ కు మూడో పరాజయం, ఇంగ్లాండ్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు.  సౌతాఫ్రికా బౌలర్ కాప్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీసింది.

మౌంట్ మంగనూయీలోని బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఓపెనర్ వ్యాట్-3; కెప్టెన్ నైట్-9; స్కైవర్-16 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో మరో ఓపెనర్ బ్యూమోంట్- జోన్స్ లు నాలుగో వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్యూమోంట్ 62, జోన్స్ 53 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులు చేసింది. కాప్ ఐదు; మసబట క్లాస్ రెండు; అయబొంగా ఖాక ఒక వికెట్ పడగొట్టారు.

సౌతాఫ్రికా 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత  వచ్చిన బ్యాట్స్ విమెన్ ఆచి తూచి ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. లారా వోల్వార్ట్-77; కెప్టెన్ సునే లూస్-36; మరిజన్నే కాప్-32; పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా 49.2  ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో శుభ్ ష్రోల్ రెండు; క్రాస్, ఎక్సెల్ స్టోన్; స్కైవర్, చార్లోట్టే డీన్ తలా ఒక వికెట్ సాధించారు.
ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన కాప కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్