Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్:  సౌతాఫ్రికా  ఉత్కంఠ విజయం

మహిళల వరల్డ్ కప్:  సౌతాఫ్రికా  ఉత్కంఠ విజయం

South Africa Another victory: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య న్యూజిలాండ్ పై సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.  సౌతాఫ్రికాకు ఇది వరుసగా నాలుగో విజయం. రెండు వికెట్లతో పాటు 34 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సౌతాఫ్రికా  ఆల్ రౌండర్ మారిజెన్ కాప్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

హామిల్టన్ లోని సెడ్డాన్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  6 పరుగులకే కివీస్ మహిళలు తొలి వికెట్ (బేట్స్-4)  కోల్పోయారు. కెప్టెన్ సోపీ డివైన్-అమేలియా కెర్ర్ లు రెండో వికెట్ కు 81 పరుగులు జోడించారు. అమేలియా 42 పరుగులు చేసి ఔటయ్యింది. సెత్తార్ వైట్ ఒక పరుగుకే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత డివైన్-గ్రీన్ లు నాలుగో వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గ్రీన్ 30; కెప్టెన్ సోఫీ 93 పరుగులు చేసి ఔటయ్యారు.  చివర్లో హల్లిడే 24 పరుగులతో రాణించింది. 47.5 ఓవర్లలో 228 పరుగులకు కీవీస్ ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, కాక చెరో మూడు; కాప్ రెండు; సునే లూస్ ఒక వికెట్ పడగొట్టారు.

సౌతాఫ్రికా 25 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. లిజెల్లీ  17 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. టాజ్మిన్ బ్రిత్స్ 18 స్కోరు చేసి పెవిలియన్ చేరింది. మూడో వికెట్ కు కెప్టెన్ లూస్- లారా వోల్వార్డ్ లు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వోల్వార్డ్ 67;లూస్ 51 చేసి ఔటయ్యారు. తర్వాత వచ్చినవారు క్రీజులో కుదురుకోలేకపోయారు. దీనితో  వరుస వికెట్లు పడ్డారు. చివరి రెండు ఓవర్లలో 14  పరుగులు కావాల్సి ఉన్న తరుణంలో 49 ఓవర్లో మరో వికెట్ పడింది. మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే చివరి ఓవర్ తొలి బంతిని కాప్ ఫోర్ కొట్టి ఆశలు రేకెత్తించింది, తర్వాత మరో పరుగు రావడంతో స్కోరు సమం అయ్యింది. తర్వాతి బంతిని కాక సింగల్ చేయడంతో సౌతాఫ్రికా గట్టెక్కింది.

కీవీస్ బౌలర్లలో అమేలియా కెర్ర్ మూడు; ఫ్రాన్సిస్ మాకీ రెండు; హన్నా రో-సోఫీ డివైన్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read : అరుదైన మహిళా క్రికెటర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్