Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్నేటి నుంచి టీ20 సూపర్-8 మ్యాచ్ లు ప్రారంభం

నేటి నుంచి టీ20 సూపర్-8 మ్యాచ్ లు ప్రారంభం

వెస్టిండీస్, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్ లు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 8 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో అమెరికా- దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు రెండో మ్యాచ్ లో ఇంగ్లండ్-వెస్టిండీస్ … రేపు రాత్రి 8 గంటలకు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది.

లీగ్ దశలో  నాలుగు గ్రూపులనుంచి రెండేసి చొప్పున మొత్తం 8 జట్లు సూపర్ 8 కు చేరుకున్నాయి. ఇక్కడ గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్….. గ్రూప్ 2 లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, అమెరికా జట్లు ఉన్నాయి. ఒక్కో జట్టూ తన గ్రూప్ లో మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. మొత్తం 12 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో ఉన్న రెండేసి జట్లు… మొత్తం నాలుగు జట్లు సెమీస్ కు చేరతాయి.

కాగా, సూపర్ 8 నుంచి ఫైనల్ వరకూ జరిగే అన్ని మ్యాచ్ లూ వెస్టిండీస్ లోనే జరగనున్నాయి.

ఇండియా రేపు ఆఫ్తాన్ తో (వేదిక: బ్రిడ్జ్ టౌన్), 22 న బంగ్లాదేశ్ (నార్త్ సౌండ్); 24న ఆస్ట్రేలియాతో (గ్రాస్ ఐలెట్) తో ఆడనుంది.

జూన్ 29న జరిగే ఫైనల్ పోరు జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్