RSA won 2nd : న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 198 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. చివరి రోజున గెలుపు కోసం 332 పరుగులు చేయాల్సి న కివీస్ 133 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
నాలుగు వికెట్లకు 94 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఆట కివీస్ ప్రారంభించింది. నిన్న 60 పరుగులతో క్రీజులో ఉన్న డెవాన్ కాన్వే-92 వద్ద సిపామ్లా బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగి సెంచరీ అవకాశాన్ని కొద్దిలో కోల్పోయాడు. టామ్ బ్లండెల్ -44 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన గ్రాండ్ హోం రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగులే చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 227 పరుగులకు కివీస్ ఆలౌట్ అయ్యింది. రబడ, జేమిసన్, కేశవ్ మహారాజ్ తలా మూడు వికెట్లు సాధించగా, మరో వికెట్ సిపామ్లా కు దక్కింది.
రెండో టెస్టులో మొత్తం 8 వికెట్లు సాధించిన సౌతాఫ్రికా బౌలర్ రబడ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కగా, సిరీస్ లో మొత్తం 14 వికెట్లతో రాణించిన కివీస్ బౌలర్ మట్ హెన్రీ కి ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించింది.
Must Read : కివీస్ తో టెస్ట్: సౌతాఫ్రికా సాధించేనా?