షెల్ కంపెనీలతో తెలియకుండా వ్యాపారం నిర్వహించే సంస్థలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా రక్షణ చర్యలను అమలు చేసిందా, షెల్ కంపెనీలతో వ్యాపారం నిర్వహించకుండా కంపెనీలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపట్టిందా అలా అయితే వివరాలు మరియు కాకపోతే దానికి గల కారణాలు తెలుపగలరు అని తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సమాధానమిస్తూ కంపెనీల చట్టం, 2013లోని కంపెనీల రూల్స్ 2016 (సవరించిన రూల్స్ 2019) తో పాటు అలాంటి కంపెనీలను గుర్తించడం మరియు తొలగించడం కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టిందన్నారు.
వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలకు వారి ఆర్థిక నివేదికలు లేదా వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయని వారు కంపెనీల చట్టం ప్రకారం తొలగించబడతారని ఆలా గత 3 ఏళ్లలో 1,27,952 కంపెనీలు తొలగింపబడ్డాయని అటువంటి కంపెనీల లావాదేవీకి సంబంధించి సురక్షిత చర్యలను రూపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కంపెనీల చట్టం, 2013 షెడ్యూల్ 3 ని 24.03.2021 నాటి నోటిఫికేషన్ నంబర్ G.S.R (E) ప్రకారం సవరించిందిని ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలియజేసారు.