Sunday, January 19, 2025
Homeసినిమార‌వితేజ‌ ‘ధమాకా’ నుంచి స్పెషల్ పోస్టర్

ర‌వితేజ‌ ‘ధమాకా’ నుంచి స్పెషల్ పోస్టర్

Mass Dhamaka: మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా ‘ధమాకా’ చిత్రం రాబోతోంది. ‘డబుల్ ఇంపాక్ట్’ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో రవితేజ ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ మూమెంట్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ స్పెష‌ల్ పోస్టర్ కలర్ ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతున్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్