మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ సరసన పూజా హేగ్డే నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ, క్రేజీ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆచార్య విడుదల ఆగింది కానీ.. లేకపోతే మే 13న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. దర్శకుడు కొరటాల శివ ఆచార్య గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. రామ్ చరణ్ పాత్ర నిడివి ఎంత అనేది ఇప్పటి వరకు అఫిషియల్ గా ప్రకటించలేదు కానీ.. ఓ 25 నిమిషాలు ఉంటుందని వార్తలు వచ్చాయి. అందరూ దానికే ఫిక్స్ అయ్యారు. అయితే.. చరణ్ పాత్ర సెకండాఫ్ మొత్తం ఉంటుందన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆచార్య అనేది చరణ్ కథ. ఎమోషన్ అంతా చరణ్ పాత్ర చుట్టూనే ఉంటుందన్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఓ పదిరోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే.. షూటింగ్ మొదలుపెట్టడానికి ఆచార్య టీమ్ అంతా రెడీగా ఉందన్నారు. ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేశారు. సెకండ్ సాంగ్ ను త్వరలో రిలీజ్ చేస్తామని కొరటాల చెప్పారు.