Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IND Vs. WI: స్పిన్ మాయా జాలం: తొలి వన్డే ఇండియాదే

IND Vs. WI: స్పిన్ మాయా జాలం: తొలి వన్డే ఇండియాదే

భారత స్పిన్నర్లు రాణించడంతో వెస్టిండీస్ తో బార్బొడాస్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ మైదానంలో  జరిగిన తొలి వన్డేలో ఇండియా 5 వికెట్లతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఇండియా స్పిన్ దెబ్బకు 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ షాయ్ హోప్ ఒక్కడే 43 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. అథనాజె-22;  బ్రాండన్ కింగ్ -17 రన్స్ చేశారు. కుల్దీప్ యాదవ్ 4; రవీంద్ర జడేజా 3; హార్దిక్ పాండ్యా, ముఖేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో ఇండియా 18 పరుగులకే ఓపెనర్ శుభ్ మన్ గిల్ (7) ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 19 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా (5), శార్దూల్ ఠాకూర్ (1) విఫలమయ్యారు. ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో  అర్ధ సెంచరీ (52) చేసి నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా-16, రోహిత్ శర్మ-12పరుగులతో క్రీజులో ఉన్నారు. 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యం సాధించింది.

కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్