Thursday, April 3, 2025
Homeజాతీయం995 రూపాయలకు స్పుత్నిక్-వి

995 రూపాయలకు స్పుత్నిక్-వి

స్పుత్నిక్-వి వాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. ఒక డోసు ధర 995 రూపాయలుగా నిర్ణయించింది. రూ.940 అసలు ధర కాగా 5 శాతం జిఎస్టి కలిపి రూ.995.40 కు వినియోగదారుడికి అందుబాటులో వుంటుంది.

రష్యాలో తయారైన వాక్సిన్ స్పుత్నిక్-వి కోవిడ్  నియంత్రణలో మంచి ఫలితాలు రాబట్టింది. భారతదేశంలో తెలంగాణకు చెందిన రెడ్డీస్ లాబ్ స్పుత్నిక్ వాక్సిన్ తయారీ, మార్కెటింగ్ చేసుకునే హక్కులు పొందింది. రష్యా నుంచి కొన్ని డోసులు భారత దేశానికి ఇప్పటికే చేరుకున్నాయి. వీటి అమ్మకాలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెడ్డీస్ లాబ్ దేశీయంగా తయారీ మొదలు పెట్టిన తరువాత ప్రస్తుత ధర కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్