Monday, February 24, 2025
HomeసినిమాSR కళ్యాణ మండపం టీజర్ అదుర్స్

SR కళ్యాణ మండపం టీజర్ అదుర్స్

యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘SR కళ్యాణ మండపం’. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఏర్పడింది. కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా SR కళ్యాణ మండపం టీజర్ రిలీజ్ చేశారు.

‘మూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదరా… పెద్దలతో ఎట్టా మాట్లాడాలో నేర్పించలేదా మీ నాయన నీకు’ అనే డైలాగ్ బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంది. ‘గడ్డాలు నరిసినా బుద్దిరాని వాళ్ళతో ఎలా మాట్లాడాలి’ అని చెప్పిన కిరణ్ పంచ్ డైలాగ్ కు మంచి రెస్సాన్స్ వస్తోంది. చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ ను ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్