Sunday, January 19, 2025
HomeసినిమాSree Leela: శ్రీలీల వరుస రిలీజ్ లు కలిసొచ్చేనా..?

Sree Leela: శ్రీలీల వరుస రిలీజ్ లు కలిసొచ్చేనా..?

శ్రీలీల.. ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేరు ఇది. ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ అయ్యింది. ముఖ్యంగా తన డ్యాన్స్ తో అదరగొట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకోవడంతో ఈ అమ్మడు కంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరేమో అనుకుంటున్నారు. మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్.. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో లక్కీ ఛాన్స్ దక్కించుకుని శ్రీలీల టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

సెప్టెంబర్ 28న ‘స్కంద’ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన స్కంద మూవీ టాక్ నెగిటివ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దూసుకెళుతుంది. ఈ సినిమాలో కూడా డ్యాన్స్ అదరగొట్టింది. ఇక అక్టోబర్ లో శ్రీలీల ‘భగవంత్ కేసరి’ సినిమాతో రానుంది. ఇందులో నందమూరి బాలకృష్ణకు కూతురుగా నటించింది. బాలయ్య, శ్రీలీల పై చిత్రీకరించిన పాటకు అనూహ్య స్పందన వచ్చింది. అక్టోబర్ 19న భగవంత్ కేసరి చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

నవంబర్ లో శ్రీలీల ఆదికేశవ సినిమాతో రానుంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కు జంటగా నటించింది. ఇది పక్కా మాస్ మూవీ. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా టీజర్ ఆకట్టుకోవడంతో సినిమా పై ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. ఇక డిసెంబర్ లో ఎక్స్ ట్రా సినిమాతో రానుంది. ఇందులో నితిన్ కు జంటగా నటించింది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులోని డేంజర్ పిల్లా అంటూ సాగే పాట విశేషంగా ఆకట్టుకుంది. ఇక జనవరిలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో రానుంది. ఇలా నెలకో సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల్లో ఏ రెండు సినిమాలు సక్సెస్ అయినా శ్రీలీలకు మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. ఈ వరుస రిలీజ్ లు శ్రీలీలకు కలిసొస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్