Sunday, January 19, 2025
Homeసినిమాఇప్పటి హీరోయిన్స్ కి ధైర్యం ఎక్కువే!

ఇప్పటి హీరోయిన్స్ కి ధైర్యం ఎక్కువే!

ఏ భాషకి చెందిన సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోయిన్స్ ఒక వెలుగు వెలిగే సమయం చాలా తక్కువగానే ఉంటుంది. అందువల్లనే గ్లామర్ ఉండగానే నార్త్ లోను .. సౌత్ లోను వరుస సినిమాలు చేయాలనే పట్టుదలతో పరుగులు పెడుతుంటారు. స్టార్ హీరోల జోడీ కడుతూ తమ టార్గెట్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆశతో ఉంటారు. అందువల్లనే ఎక్కే విమానం .. దిగే విమానం అన్నంత బిజీగా కనిపిస్తూ ఉంటారు.

సినిమా ఫీల్డ్ లో మొదటి నుంచి ఒక ఆచారం .. ఆనవాయితీ ఉన్నాయి. ఎవరైనా ఒక పాత్రలో సక్సెస్ అయితే .. ఆ పాత్ర వాళ్లకి పేరు తెస్తే ఇక అవే పాత్రలు క్యూ కడుతూ ఉంటాయి. అలా ఒకే తరహా పాత్రలనే చేస్తూ కెరియర్ ను ముగించినవారు ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంటారు. ఈ కారణంగానే ఒకప్పుడు కూతురు పాత్రలు .. చెల్లెలి పాత్రలు చేయడానికి హీరోయిన్స్ ఎంతమాత్రం ఒప్పుకునేవారు కాదు. అలాంటి కథలను వినే ప్రయత్నం కూడా చేసేవారు కాదు.

ఆల్రెడీ అలాంటి పాత్రలను ఒప్పేసుకుని .. ఆ ఇమేజ్ లో నుంచి బయటపడలేకపోతున్నవారితోనే  మళ్లీ చేయించేవారు. కానీ ఇప్పటి హీరోయిన్స్ ఈ తరహా పాత్రలు చేయడానికి పెద్దగా భయపడటం లేదని అర్థమవుతోంది. అందుకు ఉదాహరణగా కీర్తి సురేశ్ .. శ్రీలీల పేర్లను చెప్పుకోవచ్చు. రజనీ ‘పెద్దన్న’ సినిమాలో ఆయనకి చెల్లెలిగా నటించిన కీర్తి సురేశ్, ప్రస్తుతం ‘భోళా శంకర్’లోను చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ఇక ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలయ్యకి కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. మంచి స్టార్ డమ్ ఉండగానే వాళ్లు ఈ తరహా పాత్రలను ఒప్పుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్