Sunday, January 19, 2025
Homeసినిమా'ధమాకా' హిట్ తో పవన్ సినిమాలో ఛాన్స్ పట్టేసిందట! 

‘ధమాకా’ హిట్ తో పవన్ సినిమాలో ఛాన్స్ పట్టేసిందట! 

కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ‘ధమాకా’ జోరు కొనసాగుతోంది. క్రితం నెల 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, 14 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసింది. ఈ సినిమాలో గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా .. డాన్స్ పరంగా శ్రీలీల చేసిన సందడి అంతా ఇంతా కాదు. మాస్ మహారాజ్ తో సమానంగా ఆమె మాస్ స్టెప్పులతో దుమ్మురేపేసింది. కుర్ర హీరోల జోడీగానే కాదు, సీనియర్ హీరోల సరసన కూడా మెప్పించగలనని నిరూపించింది.

ఈ సినిమా తరువాత ఈ సుందరి మరింత బిజీ కావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. అందుకు తగినట్టుగానే ఈ పాలరాతి శిల్పాన్ని వెతుకుతుంటు పవన్ సినిమా నుంచి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఆ సినిమా తరువాత ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. ఇటీవలే పవన్ కి ఒక కథ వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రీలీలను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. బోయపాటి – రామ్ ప్రాజెక్టులోను, వక్కంతం వంశీ – నితిన్ సినిమాలోను హీరోయిన్ గా అలరించనుంది. అలాగే శర్వానంద్ .. వైష్ణవ్ తేజ్ జోడిగా కూడా ఆనందాల సందడి చేయనుంది. ఒకదానికొకటి సంబంధం లేని జోనర్లలో ఈ సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ సినిమాకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. అదే నిజమైతే అమ్మడి దశ తిరిగిపోవడం ఖాయమని వేరే చెప్పాలా?!

RELATED ARTICLES

Most Popular

న్యూస్