Thursday, April 10, 2025
Homeసినిమాడాన్సులలో ఎంతమాత్రం తగ్గని శ్రీలీల!

డాన్సులలో ఎంతమాత్రం తగ్గని శ్రీలీల!

ఒకప్పుడు హీరోయిన్స్ కి నటన ప్రధానమైన పాత్రలు ఎక్కువ దక్కేవి. ఇక డాన్సులు ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ పరిధిలోకి వెళ్లిపోయేవి. అప్పట్లో ఏఎన్నార్ తో డాన్స్ చేయవలసి వస్తేనే హీరోయిన్స్ కాస్త కష్టపడవలసి వచ్చేది. ఆ తరువాత జనరేషన్ లో చిరంజీవితో డాన్స్ చేయవలసి వస్తే హీరోయిన్స్ కాస్త గట్టిగానే కసరత్తు చేయవలసి వచ్చేది. అలా ఆ రోజుల్లో విజయశాంతి .. రాధ .. భానుప్రియ చిరంజీవి జోడీలుగా డాన్సుల విషయంలో మెప్పించారు.

ఇక ఇప్పుడున్న పరిస్థితులలో హీరోలందరూ ముందుగానే డాన్స్ లలో తర్ఫీదును పొంది రంగంలోకి దిగుతున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ .. బన్నీ .. రామ్ లను డాన్స్ విషయంలో అందుకోవటం కష్టం. ఇక ఆ తరువాత వరుసలోని హీరోలను కూడా డాన్స్ విషయంలో తీసిపారేయలేం. వాళ్ల జోడీగా డాన్సులలో మెప్పించాలంటే హీరోయిన్స్ కి ఒక సవాలే. డాన్స్ బాగా తెలిసిన హీరోయిన్స్ లో  సాయిపల్లవి మాత్రమే కనిపించేది.

ఈ నేపథ్యంలోనే గ్లామర్ తో పాటు డాన్సులతోను మెప్పించగలడు అనే మార్కులను కృతి శెట్టి సొంతం చేసుకుంది. ఇక రీసెంట్  గా వచ్చిన ‘ధమకా’ సినిమాతో తాను కూడా డాన్సులను అదరగొట్టేయగలనని శ్రీలీల నిరూపించింది. ఇప్పుడున్న హీరోయిన్స్ లో కృతి శెట్టి .. శ్రీలీల ఈ ఇద్దరూ డాన్స్ గొప్పగా చేస్తున్నారని శేఖర్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అందుకు నిదర్శనం. అందువలన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకరిని మించి ఒకరు అవకాశాలను అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్