Wednesday, April 17, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: సన్ రైజర్స్ రైజింగ్

ఐపీఎల్: సన్ రైజర్స్ రైజింగ్

Sun ‘Raising’: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. తొలిరెండు మ్యాచ్ లు ఓడిపోయిన సన్ రైజర్స్ ఆ తర్వాత వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. నేడు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించి ఈ సీజన్లో వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది.

నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ లో లివింగ్ స్టోన్(60); షారుఖ్ ఖాన్(26) మినహా మిగిలిన వారు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పంజాబ్ కోల్పోయింది. ఉమ్రాన్ నాలుగు, భువీ మూడు; నటరాజన్, జగ్దీశ సుచిత్ చెరో వికెట్ తీసుకున్నారు.

హైదరాబాద్ 14 పరుగుల వద్ద తొలి వికెట్ (విలియమ్సన్-3) కోల్పోయింది.  అభిషేక్ శర్మ-31; రాహుల్ త్రిపాఠి-34 పరుగులతో రాణించారు. వీద్దరూ ఔటైన తర్వాత ఎడెన్ మార్ క్రమ్-నికోలస్ పూరన్ లు మరో వికెట్ పడకుండా 18.5 ఓవర్లలోనే లక్ష్యం సాధించారు. మార్ క్రమ్-41; పూరన్-35తో అజేయంగా నిలిచారు.

ఉమ్రాన్ మాలిక్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్